SpaceX Founder Elon Musk (File Image)

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌(Elon Musk)..2027 నాటికి ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిల‌వ‌నున్నారు.ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డుల్లోకి ఎక్క‌నున్న‌ట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ తెలిపింది. ప్ర‌తి ఏడాది మ‌స్క్ ఆదాయం పెరుగుతున్న గ‌ణాంకాల ఆధారంగా ఈ అంచ‌నా వేశారు. మ‌స్క్ వార్షిక సంప‌ద వృద్ధి సుమారు 109.88గా ఉన్న‌ట్లు భావిస్తున్నారు.ప్ర‌స్తుతం 237 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా మస్క్ మొద‌టి స్థానంలో నిలిచారు

ట్రిలియ‌నీర్ క్ల‌బ్‌లో చేర‌నున్న వారిలో భార‌తీయ వ్యాపారి గౌత‌మ్ అదానీ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఎన్విడియా సీఈవో జెన్‌సెన్ హువాంగ్‌, ఇండోనేషియా మ్యాగ్నెట్ ప్ర‌జోగో పంగెస్టు కూడా ఉన్నారు. 2028 వ‌ర‌కు ఈ ముగ్గురూ ట్రిలియ‌నీర్లు అయ్యే ఛాన్సు ఉన్న‌ట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అంచ‌నా వేసింది. ఫ్రెంచ్ వ్యాపార‌వేత్త, లూయిస్ విట్టాన్ ఓన‌ర్ బెర్నార్డ్ అర్నాల్ట్‌.. 2030 వ‌ర‌కు ట్రిలియ‌నీర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు.ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ మాత్రం 2033లో ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని తెలిపింది.

ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు పై ఓ లుక్కేసుకోండి, అదనపు డేటాతో పాటుగా, ఓటీటీ సదుపాయాలు

గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జాబితాలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న అదానీ సంపద 100 బిలియన్ డాలర్లుకాగా.. ట్రిలియనీర్ జాబితాలో చేరే రెండో వ్యక్తిగా ఆయన నిలవనున్నారని నివేదిక అంచనా వేసింది.మరో బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం111 బిలియన్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. 2033 వరకు ఆయన ఇదే స్థితిని కొనసాగించవచ్చు.