Elyments App: విదేశీ యాప్‌లకు స్వదేశీ యాప్ ఎలిమెంట్స్‌ భారీ షాక్, ఒక్కరోజులోనే 5 లక్షల డౌన్ లోడ్లు, ఎనిమిది భాషల్లో ఆడియో, వీడియో కాల్
Elyments App (Photo Credits: Google Play store)

New Delhi, July 6: సోషల్‌ మీడియా రంగంలోకి తొలి దేశీయ సూపర్‌ యాప్‌ ఎలిమెంట్స్‌ (Elyments App) అడుగుపెట్టింది. ఈ యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు దీటుగా రూపొందించిన ఈ యాప్‌కు యువతను విశేషంగా ఆకట్టుకుంది. తొలిరోజే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అయిదు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వాలంటీర్లుగా ఉన్న వెయ్యిమందికి పైగా ఐటీ నిపుణులు సంయుక్తంగా ఎలి మెంట్స్‌ యాప్‌ను రూపొందించారు. టిక్‌టాక్‌కు ధీటుగా చింగారి యాప్, 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ గురించి తెలుసుకోండి

ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్‌ అయ్యేందుకు స్థానికంగా షాపింగ్‌ చేసేందుకు ఈ యాప్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ఎనిమిది భారతీయ భాషల్లో యాప్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల డేటా ఇండియాలోనే నిల్వచేయబడుతుందని యాప్‌ (Elyments mobile app) రూపకర్తలు తెలిపారు. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను మూడో వ్యక్తితో పంచుకోబడదని లిఖితపూర్వకంగా హమీ ఇచ్చారు. దీనిద్వారా ఉచితంగా ఆడియో-వీడియో కాల్స్‌ చేసుకోవడంతోపాటు, ప్రైవేట్‌ చాట్‌ కనెక్షన్‌ను అనుమతిస్తుందని పేర్కొన్నారు.

Here's Elyments App Launched by Vice President Venkaiah Naidu

ఈ యాప్ ద్వారా, వినియోగదారులు వారి స్నేహితులతో కనెక్ట్ అవ్వవచ్చు, చాట్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు అపరిమిత వాయిస్, వీడియో కాల్స్ చేసే వీలుంది. ముఖ్యంగా Elyments App సర్వర్‌లన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ (Aatma Nirbhar Bharat) కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణాలు, గ్రామాల మధ్య సమన్వయం పెరుగుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఎనిమిది దేశీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఎలిమెంట్స్‌ యాప్ విదేశీ యాప్‌లతో పోటీపడి నిలవాలని వెంకయ్యనాయుడు అశాభావం వ్యక్తం చేశారు.

మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, మానవ వనరులను సుసంపన్న చేయడం, బలమైన సరఫరా వ్యవస్థను సృష్టించడం ద్వారా దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రచారం జరుగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రక్షణవాదాన్ని ప్రోత్సహించ డంతోపాటు దేశ స్వాభావిక లక్షణాన్ని గుర్తించి, పెట్టుబడులకు ఆచరణాత్మక అభివృద్ధి వ్యూహాన్ని అవలం బించడమే ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యమని తెలిపారు. మన శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు ప్రపంచస్థాయిలో నాయకత్వ స్థానాల్లో ఉండటం వల్లే ప్రపంచంలోనే ఐటీ సూపర్‌ పవర్‌గా భారత్‌ నిలిచిందని యాప్ ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar), యోగా గురువు బాబా రాందేవ్ , బిజినెస్ మెన్ అనంత్ గోయెంకాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.