Facebook Data Leak: భారత్ నుంచి 60 లక్షల ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్, ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి పర్సనల్ సమాచారం, ఫోన్ నంబర్, దీంతో పాటుగా 106 దేశాల్లో ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్
యూజర్ల పర్సనల్ సమాచారాన్ని, ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి (Facebook Data Leak) ఉంచినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీక్ (Personal Data of 553 Million Facebook IDs) అయినట్లు వార్తలు వస్తున్నాయి.
California, April 4: యూజర్ల పర్సనల్ సమాచారాన్ని, ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి (Facebook Data Leak) ఉంచినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీక్ (Personal Data of 553 Million Facebook IDs) అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్‌బుక్ డేటాను ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేటా లీక్ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్‌బుక్ యూజర్లలో కలకలం రేపుతోంది.
ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. కాగా, 106 దేశాల్లో ఫేస్‌బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్ డేటా లీక్‌తో సుమారు 1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. యుఎస్ నుంచి 32.3 మిల్లియన్ల యూజర్లు లీక్ వలలో చిక్కుకోగా, యుకె నుంచి 11.5 మిల్లియన్ల యూజర్లు డేటా లీక్ అయింది. ఈ లీక్ అంతా టెలిగ్రాం బాట్ ద్వారా జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇండియాలో 6 మిల్లియన్ల యూజర్లు డేటా లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా 106 సపరేట్ డౌన్లోడ్ ప్యాకేజీస్ ని ఆఫర్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అది కంట్రీ బేస్ మీద ఆధారపడి ఆఫర్ చేస్తోంది.
అయితే, ఫేస్‌బుక్ డేటా లీక్ సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. ఫేస్‌బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్‌బుక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఫేస్‌బుక్ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది.
(The above story first appeared on LatestLY on Apr 04, 2021 04:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

