RBI to introduce 24/7 NEFT soon | Photo Credits: PTI

ఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌ ఇచ్చింది. అమెజాన్‌పే, ఫోన్‌పే, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సింపుల్‌ వంటి 35కు పైగా నాన్‌ బ్యాంకింగ్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) కంపెనీలకు (Fintech firms) ఆర్‌బీఐ ఝలక్ ఇచ్చింది. పీపీఐలు (PPI) తమ కస్టమర్‌కు కల్పించిన క్రెడిట్‌ లైన్‌ లేదా రుణ పరిమితి నుంచి మొబైల్‌ వాలెట్‌ లేదా కార్డులో నగదు జమ చేయవద్దని ఆదేశించింది. పీపీఐ మాస్టర్‌ డైరెక్షన్‌ ఇందుకు అనుమతించదని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌, 2007 ప్రకారం కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం విడుదల చేసిన సర్కులర్‌లో ఆర్‌బీఐ (RBI) హెచ్చరించింది.

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీల భాగస్వామ్యంలో వ్యాలెట్లు లేదా కార్డుల ద్వారా క్రెడిట్‌ లైన్‌ ఆఫర్‌ చేసే ఫిన్‌టెక్‌ కంపెనీలు, బయ్‌ నౌ, పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌) సేవలు ఆఫర్‌ చేస్తున్న సంస్థలకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని మాక్వెరీ క్యాపిటల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ గణపతి అన్నారు. కొన్ని నిబంధనల గడువు పొడిగింపు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కార్డు యాక్టివేషన్‌, క్రెడిట్‌ లిమిట్‌ పెంపు నిబంధనల అమలుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలకు ఆర్‌బీఐ మరో 3 నెలల గడువిచ్చింది.

డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు అలర్ట్ అవ్వండి, జూలై 1 నుంచి టోకెనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి, మర్చంట్లు కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాలని RBI ఆదేశాలు

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీ, వాటి నిర్వహణకు సంబంధించిన గతంలో ఆర్‌బీఐ విడుదల చేసిన మాస్టర్‌ డైరెక్షన్‌ జూలై 1 నుంచి అమలులోకి రావాల్సింది. ఇండస్ట్రీ వర్గాల వినతి మేరకు కొన్ని నిబంధనల అమలు గడువును మాత్రం 2022 అక్టోబరు 1కి పొడిగిస్తూ ఆర్‌బీఐ మంగళవారం సర్కులర్‌ జారీ చేసింది. మిగతావి మాత్రం జూలై 1 నుంచే అమలులో రానున్నాయి