 
                                                                 దేశీయ ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ (Flipkart Big Diwali Sale) 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు ఆయా వస్తువులపై పదిశాతం డిస్కౌంట్ లబిస్తుంది.
ప్లిఫ్‌కార్ట్ తన సేల్ పేజ్‌లో ఐఫోన్లు, మొటొరొలో, షియోమీ ఫోన్లకు సంబంధించి హాట్ డీల్స్ వివరాలను టీజర్లలో వెల్లడించింది. ఈ ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కాంట్లు ఆఫర్ చేయనున్నట్టు ప్లిఫ్‌కార్ట్ అందులో తెలిపింది. డెస్క్‌టాప్‌లు, పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ సహా పలు ఉత్పత్తులపై 80 శాతం వరకూ దివాళీ సేల్‌లో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని చెబుతోంది.
టీవీలు, అప్లయన్సెస్‌పై 75 శాతం వరకూ ఆఫర్లు ఉంటాని ఆన్‌లైన్ రిటైలర్ కస్టమర్లను ఊరిస్తోంది. బిగ్ దివాళి సేల్ సందర్భంగా రూ 60,000 నుంచి రూ 66,199 వరకూ పలికే ఐఫోన్ 12, రూ 45,199 నుంచి అందుబాటులో ఉండే ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్లను ప్లిఫకార్ట్ ఆఫర్ చేయవచ్చని భావిస్తున్నారు.
Xiaomi ఫోన్‌ల విషయానికి వస్తే, Redmi 9 Prime, Redmi 9i Sport, Redmi 9 Power, Redmi 9 Prime, Redmi 8A Dual, Redmi Note 9 ఫోన్లపై భారీ డిసౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. మోటో జీ40, మోటో జీ60, మోటో ఈ7 పవర్, మోటో జీ40 ఫ్యూజన్ ఫోన్లపైనా ప్లిఫ్‌కార్ట్ దివాళి సేల్‌లో భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఆశిస్తున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
