BANNED 50 Android Apps: 50 యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్, మీ ఫోన్‌లో ఈ యాప్స్   ఉంటే డేంజర్, వెంటనే డిలీట్ చేయకపోతే చెల్లించక తప్పదు మూల్యం, లిస్ట్ ఇదే!
Mobile Apps. Representational image. (Photo Credit: Pixabay)

New Delhi, July 22: గూగుల్ ప్లే స్టోర్‌లో (Google playstore) కనిపించే అన్ని యాప్స్ సెక్యూర్ కాదు.. అందులో చాలావరకూ ఫేక్ యాప్స్ (Fake apps) అధికంగా ఉంటాయి. యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాప్స్ డిజైన్ చేస్తారు. ఇలాంటి యాప్స్ కనిపించగానే యూజర్లు తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసేసుకుంటారు. ఆయా యాప్ డెవలపర్లు వెంటనే యూజర్ల డేటాను తస్కరిస్తుంటారు. యూజర్ల ప్రైవసీ (User privacy) పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే తెలిసో తెలియకో ఏదైనా యాప్ ఇన్ స్టాల్ (Install) చేసినప్పుడు ఆ యాప్ రివ్యూలు రేటింగ్ చూస్తుండాలి. అప్పుడే ఆ యాప్ ఎంతవరకు బెటర్ అనేది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఫోన్లలో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. కానీ, యూజర్లు యాప్స్ గురించి అవగాహన లేకుండానే తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ప్రైవసీపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందుకే గూగుల్ (Google) వంటి టెక్ దిగ్గజాలు కూడా యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఆయా యాప్స్ గురించి ప్లే స్టోర్‌లో స్కాన్ చేస్తున్నాయి. ఏమైనా హానికర యాప్స్  ఉన్నాయంటే వెంటనే తమ ప్లాట్ ఫాం నుంచి డిలీట్ చేస్తున్నాయి. ఇప్పటికే క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ Zscaler ఇప్పుడు Google ఇటీవల 50కిపైగా యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఎందుకంటే అందులో ఎక్కువగా మాల్వేర్ యాప్స్ ఉన్నాయి. నివేదికలో Zscaler తమ ThreatLabz టీమ్ సాయంతో Google Playలో మూడు వేర్వేరు మాల్వేర్ విభాగాలైన Joker, Facestealer, Coper తో యాప్‌లను గుర్తించాయి. ఈ యాప్‌లలో చాలా వరకు జోకర్ మాల్వేర్ ఉందని నివేదిక పేర్కొంది, నిస్సందేహంగా Android డివైజ్‌లను లక్ష్యంగా చేసుకున్న ప్రముఖ మాల్వేర్ ఫ్యామిలీల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. జోకర్ మాల్వేర్ ‘కోడ్, ఎగ్జిక్యూషన్ మెథడ్స్, పేలోడ్-రిట్రీవింగ్ టెక్నిక్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లతో సహా మాల్వేర్ ట్రేస్ సిగ్నేచర్‌లను సవరించిందని నివేదిక పేర్కొంది.

SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి

ఈ మాల్వేర్ SMS మెసేజ్‌లు, కాంటాక్ట్ లిస్టులు, డివైజ్ డేటాను చోరీ చేసే అవకాశం ఉంది. ప్రీమియం వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ (WAP) సర్వీసుల కోసం యూజర్లను సైన్ అప్ చేసేలా ప్రేరేపిస్తాయని నివేదిక వివరించింది. ఈ యాప్‌ల గురించి గూగుల్‌కు సమాచారం అందిన వెంటనే వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. కానీ, ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు.

Gautam Adani: ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతం అదాని, ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానం,10వ స్థానంలో ముఖేశ్‌ అంబానీ 

ఈ యాప్స్ ఇప్పటికే వందల నుంచి వేల మంది Android యూజర్ల ద్వారా వారి ఫోన్లలో డౌన్‌లోడ్ అయ్యాయి. అందుకే గూగుల్ అలాంటి తొలగించిన హానికర 50 యాప్‌ల జాబితాను యూజర్ల కోసం అందిస్తోంది. మీ ఫోన్‌లో ఈ కింది జాబితాలో ఏవైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే.. వెంటనే వాటిని తీసేయండి.

 

-Simple Note Scanner

-Universal PDF Scanner

-Private Messenger

-Premium SMS

-Smart Messages

-Text Emoji SMS

-Blood Pressure Checker

-Funny Keyboard

-Memory Silent Camera

-Custom Themed Keyboard

-Light Messages

-Themes Photo Keyboard

-Send SMS

-Themes Chat Messenger

-Instant Messenger

-Cool Keyboard

-Fonts Emoji Keyboard

-Mini PDF Scanner

-Smart SMS Messages

-Creative Emoji Keyboard

-Fancy SMS

-Fonts Emoji Keyboard

-Personal Message

-Funny Emoji Message

-Magic Photo Editor

-Professional Messages

-All Photo Translator

-Chat SMS

-Smile Emoji

-Wow Translator

-All Language Translate

-Cool Messages

-Blood Pressure Diary

-Chat Text SMS

-Hi Text SMS

-Emoji Theme Keyboard

-iMessager

-Text SMS

-Camera Translator

-Come Messages

-Painting Photo Editor

-Rich Theme Message

-Quick Talk Message

-Advanced SMS

-Professional Messenger

-Classic Game Messenger

-Style Message

-Private Game Messages

-Timestamp Camera

– Social Message