Google Pay: గూగుల్ పే నుంచి అదిరిపోయే శుభవార్త, ఇకపై అమెరికా నుంచి ఇండియాకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న గూగుల్ పే
Google pay

ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు గూగుల్ పే (Google Pay) శుభవార్త చెప్పింది. ఇకపై గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు (US send money to those in India, Singapore) డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది. ఈ మేర‌కు యూజ‌ర్ల‌కు ఈ స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు గూగుల్ పే తెలిపింది.

ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్ తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యాలు కూడా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గూగుల్ పే చెప్పింది.

ఈ స‌దుపాయాలు వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయ‌ని, బిజినెస్ లావాదేవీల‌కు ఈ సౌక‌ర్యం ఉండ‌బోద‌ని గూగుల్ వివ‌రించింది. ఆర్థిక సేవ‌ల సంస్థ‌లు వెస్ట్ర‌న్ యూనియ‌న్ తో న‌గ‌దు బ‌దిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేప‌థ్యంలో ఇక‌పై అమెరికా యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యాలు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పే వెల్లడించింది.

మూడు ప్రధాన బ్యాంకుల అలర్ట్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దని తెలిపిన ఎస్బిఐ, ఫోన్‌ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లకు దూరంగా ఉండాలని కోరిన PNB, ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయవద్దని తెలిపిన ఐసిఐసిఐ

అయితే వినియోగదారులు అమెరికా నుంచి భారత్‌లో ఉన్న వారికి నగదును ట్రాన్స్‌ఫర్ చేసినందుకు గల రుసుం వివరాలను వెల్లడించాల్సిఉంది. అయితే గూగుల్ పే సేవలను ఇన్నాళ్లు ఏ దేశంలోని వారు.. ఆయా ప్రాంతాల్లోనే వినియోగించుకునే వారు. కానీ ఇప్పుడు కల్పించిన వెసలుబాటు వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరనుంది. డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ పే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో న‌గదు బ‌దిలీల కోసం భార‌త్‌లో గూగుల్ పేను కోట్లాది మంది వాడుతున్నారు.