Google. Office (Photo Credits: IANS)

San Francisco, July 27: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో గూగుల్ సంస్థ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను (Google Work From) పొడిగించింది. త‌మ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి ప‌నిచేసే సౌల‌భ్యాన్ని వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ (Google) వెల్ల‌డించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ‌.. ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. డాక్టర్‌పై ఉమ్మేసిన కరోనా పేషెంట్లు, త్రిపురలో అమానుష ఘటన, దేశంలో 24 గంటల్లో 47,704 కోవిడ్-19 కేసులు నమోదు, 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు

వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాల‌నుకుంటున్న‌ట్లు మొద‌ట్లో గూగుల్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను (Google India Work From Home) ఎంక‌రేజ్ చేసింది. ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు తమ ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను వ‌చ్చే ఏడాది జూన్ చివ‌ర వ‌ర‌కు పెంచేసింది.

2019 చివ‌ర‌ల్లో మొద‌లైన క‌రోనా వైర‌స్ (COVID-19 Pandemic) 2020లో ఆగ‌స్టు స‌మీపిస్తున్నాత‌గ్గ‌డం మాట అటుంచితే.. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది.. దీంతో.. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ పొడిగించాయి.. తాజా‌గా గూగుల్ కూడా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఇతర సంస్థలపై కూడా ప్రభావితం చూపే అవకాశాలున్నట్లు సమాచారం. ఇటీవల గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ దేశంలో 75,000కోట్ల డిజిటల్‌ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.