October 18: టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇండియాకు షాకిచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన కొత్త సీరీస్ ఫోన్లు పిక్సల్ 4, పిక్సల్ 4ఎక్స్ఎల్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయడం లేదని తెలిపింది. ఈ ఫోన్లు గత వారం న్యూయార్క్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అమెరికా సహా పలు దేశాల్లో ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24వ తేదీన ఈ ఫోన్ యూజర్ల చేతికి రానుంది. అయితే గూగుల్ ఇండియాలో ఈ ఫోన్లను ఎందుకు విడుదల చేయడం లేదనే దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పిక్సల్ 4 ఫోన్లలో ప్రత్యేకంగా అందిస్తున్న రేడారే సెన్సార్ ఫీచరే దీనికి కారణం అని తెలుస్తోంది.
గూగుల్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్ టీం (ఏటీఏపీ) 2015లో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు సోలి అనే రేడార్ ఆధారిత గెస్చర్ కంట్రోల్ టెక్నాలజీని పిక్సల్ 4 ఫోన్లలో అందిస్తున్నారు. ఈ రేడార్ టెక్నాలజీ 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్ అన్‌లాక్‌ను చాలా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ లో ఫీచర్లను తాకకుండానే ఆపరేట్ చేయవచ్చు. అయితే ఇండియాలో 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీపై నిషేధం ఉంది. 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని భారత్‌లో కేవలం మిలటరీ, ప్రభుత్వ ప్రాజెక్టుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ తన పిక్సల్ 4 ఫోన్ల కోసం 60 గిగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని వినియోగించుకునేలా అనుమతి కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించిందని, కానీ అది వీలు కాకపోవడంతోనే పిక్సల్ 4 ఫోన్లను భారత్‌లో విడుదల చేయవద్దని గూగుల్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సల్ 4 ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 12.2, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ,2800 ఎంఏహెచ్ బ్యాటరీ,వైర్‌లెస్ చార్జింగ్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
గూగుల్ పిక్సల్ 4 (64జీబీ) ధర - 799 డాలర్లు (దాదాపుగా రూ.57,105), గూగుల్ పిక్సల్ 4 (128జీబీ) ధర - 899 డాలర్లు (దాదాపుగా రూ.64,250)
పిక్సల్ 4 ఎక్స్ఎల్ ఫీచర్లు
6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 12.2, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
గూగుల్ పిక్సల్ 4ఎక్స్ఎల్ (64జీబీ) ధర - 899 డాలర్లు (దాదాపుగా రూ.64,250), గూగుల్ పిక్సల్ 4ఎక్స్ఎల్ (128జీబీ) ధర - 999 డాలర్లు (దాదాపుగా రూ.71,400)