GST Council Meet: కొత్త ఫోన్లపై కేంద్రం జీఎస్‌టీ షాక్, మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం
Samsung Galaxy M30 vs Xiaomi Redmi Note 7 Pro (File Photo)

Mumbai, March 14: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కేంద్రం జీఎస్‌టీ రూపంలో భారీ షాక్‌ ఇచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జీఎస్‌టీ కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంపునకు ( GST Hike on Mobile Phones) ఆమోదం కేంద్రం తెలిపింది.

మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన శనివారం నాటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో (GST Council Meet) మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీటిపై 5 శాతంగా ఉంది.

అలాగే 2020 జూన్ 30 వరకు జీఎస్‌టీఆర్ 9, జీఎస్‌టీఆర్‌ 9 సీ దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. కాగా రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు దాఖలు చేయడం తప్పనిసరి. అంతకుముందు గడువు మార్చి 31 వరకు మాత్రమే ఉంది. అలాగే టర్నోవర్ పరిమితి రూ .2 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇవి మారాయి.

డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి, లేకుంటే పనిచేయవు

2021 జనవరి నాటికి జీఎస్‌టీ నెట్‌వర్క్‌లోని సమస్యల్ని పరిష‍్కరిస్తామని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని కౌన్సిల్‌కి తెలిపారు. ఇందుకోసం ఒక నిర్దిష్ట దశల వారీ రోడ్‌మ్యాప్‌తో వ్యవస్థను సరిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ నిర్ణయం అటు వినియోగదారులతోపాటు, స్థానిక ఉత్పత్తిదారులకు కూడా హానికరమని మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుత స్థాయి 12 శాతం నుండి మొబైల్ ఫోన్ల జీఎస్టీ రేటు పెరుగుదలకు ఇది సరైన సమయం కాదని విమర్శలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు, విబి భాగాలు ఇన్‌పుట్‌లపై జీఎస్‌టీన ద్వారా ఇబ్బందుల్లో పడిన సంస్థపై, తాజా జీఎస్‌టీ పెంపు విచిత్రమైన చర్య అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు.