Signal App (Photo-File image)

మెసెంజేర్‌ యాప్‌ వాట్సాప్‌కు సిగ్నల్ యాప్ గట్టి సవాల్ విసిరేందుకు రెడీ అయింది. ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌తో ఈ యాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు అంతా ‘సిగ్నల్‌’వైపు (WhatsApp users begin moving to Signal) వెళుతున్నారు. వాట్సాప్‌ తన సోదర సంస్థ అయిన ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను (WhatsApp users) పంచుకుంటుందన్న తాజా ప్రైవసీ అప్‌డేట్‌ కారణంగా అచ్చం వాట్సాప్‌ను (Signal App) పోలి ఉండే ‘సిగ్నల్‌’ యాప్‌ను ఎంచుకుంటున్నారు. ‘సే హెలో టు ప్రైవసీ’ అన్న టాగ్‌లైన్‌తో ఉండే సిగ్నల్‌ యూజర్ల డేటా ప్రైవసీకి పెద్దపీట వేస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.

మరి దీన్ని ఎలా వాడాలో ఓ సారి చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత దాన్ని ఫోన్లో ఇన్ స్టాల్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత ఫోన్ నంబర్ తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీ ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా మీకు ఓటీపీ లాంటి కోడ్ వస్తుంది. ఆ తరువాత మీ ఫోటో యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు మీ స్నేహితులను యాడ్ చేయాల్సి ఉంటుంది.

అయితే, కొత్తగా సిగ్నల్ యాప్ ను ఉపయోగించే చాలా మంది వినియోగదారులు తమ బంధువులును, మీత్రులను ఇందులో ఎలా యాడ్ చేయాలో వారికీ అర్ధం కావడం లేదు. కానీ, యూజర్లు వాట్సాప్ తరహాలనో సులభంగా మీ మిత్రులను ఇందులోకి జోడించవచ్చు. మీ మిత్రులు కూడా సిగ్నల్ యాప్ వాడుతుంటే మీ పని ఇంకా చాలా తేలిక అవుతుంది.

ఇప్పుడు, మీరు సిగ్నల్ యాప్లో కుడి ఎగువ భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తున్న ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. షేర్ విత్ కాంటాక్ట్స్ లేదా చూస్ హౌ టూ షేర్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు హౌ టూ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కనిపిస్తున్న లింకును ఇతర గ్రూప్ లలో షేర్ చేసి ఆహ్వానించవచ్చు.

వాట్సాప్ ఢమాల్, సిగ్నల్ యాప్ వైపై వెళుతున్న యూజర్లు, మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ, వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని తెలిపిన వాట్సాప్

వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌ను వెల్లడించడంతో దీనిపై చర్చ మొదలైంది. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఇటీవల ‘సిగ్నల్‌’ యాప్‌ను వాడమని తన ట్విటర్‌ ఫాలోవర్స్‌కు పిలుపునివ్వడంతో క్రమంగా వాట్సాప్‌ యూజర్లు సిగ్నల్‌ యాప్‌లోకి జంప్‌ అవుతున్నారు.

సిగ్నల్ యాప్ లో మామూలు మొబైల్‌ కాల్‌ తరహాలోవాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ ఉండడం కూడా దీనికి అదనపు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మీ ఐపీ అడ్రస్‌ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్‌ యాప్‌ సర్వర్ల ద్వారా కాల్స్‌ వెళతాయి. ఈ ఆప్షన్‌ ఉపయోగించినప్పుడు వాయిస్‌ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్‌ యాప్‌లో వీడియో కాల్‌ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్‌ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్‌ తదితర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో పనిచేస్తుంది. గ్రూప్స్‌ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్‌లై ఇవ్వడం, డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్, డిసప్పియరింగ్‌ మెసేజ్‌ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.