Illegal E-Ticket Booking Racket: ఐఆర్‌సీటీసీకి హ్యాకింగ్ సెగ, పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అక్రమంగా తత్కాల్ టికెట్లు బుకింగ్, అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
Hacking | Representational Image (Photo Credits: IANS)

Mumbai, September 2: ఇండియన్ రైల్వే కి హ్యాకింగ్ సెగ తగిలింది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు (IRCTC Tatkal System Faces Hack) ఇల్లీగల్ ఆపరేటర్స్, హ్యాకర్స్ (Pakistani Hackers) ప్రయత్నిస్తున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF గుర్తించింది. ఇందుకోసం వారు పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇండియన్ రైల్వేస్‌తో పాటు, బ్యాంకు ఓటీపీలను బైపాస్ చేసి మరీ తత్కాల్ టికెట్లు బుక్ (Illegal E-Ticket Booking Racket) చేస్తున్నట్టు బయటపడింది.

సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన ఆర్‌పీఎఫ్ పోలీసులు వలపన్ని ఈ ముఠాను పట్టుున్నారు. దేశవ్యాప్తంగా అక్రమ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఐఆర్‌సీటీసీ, బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ బైపాస్ చేసి టికెట్లు బుక్ చేస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లోనే ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తం చేశాయి. దీంతో అప్పట్నుంచి నిఘా పెట్టిన రైల్వే పోలీసులు... ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తే పాకిస్తాన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నాడని, సాధారణ ఛార్జీల కన్నా ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. భీమ్‌–యూపీఐ చెల్లింపు ఛార్జీలను వాపస్ చేయాలని బ్యాంకులకు సూచించిన సిబిడిటి

గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి అక్టోబర్‌లో పారిపోయాడు. అప్పట్నుంచి ఆచూకీ కోసం వెతుకుతున్నారు పోలీసులు ఒడిషాలో అతడిని పట్టుకొని బెంగళూరుకు తీసుకొచ్చారు. బెంగళూరు ఆర్‌పీఎఫ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో షాకిచ్చే విషయాలు బయటపడ్డాయి. లైనక్స్ బేస్డ్ సిస్టమ్‌పై పనిచేసే పాకిస్తానీ సాఫ్ట్‌వేర్‌ హ్యాకింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉందని వెల్లడించాడు. ఏకంగా ఇస్రో, రైల్వే, ప్రభుత్వ సంస్థలకు చెందిన అప్లికేషన్స్‌ని కూడా పాకిస్తానీ సాఫ్ట్‌వేర్ బ్రేక్ చేయగలదని పోలీసుల పరిశోధనలో తేలింది.

అతను ఏకంగా 3,000 బ్యాంక్ అకౌంట్లతో పాటు బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్నట్టు విచారణలో బయటపడింది. అతడిని విచారిస్తే బ్లాక్‌మార్కెట్‌లో 25,000 మంది హ్యాకర్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దేశమంతా ఈ రాకెట్‍ను నడిపిస్తోంది వీళ్లేనని తేలింది. దేశవ్యాప్తంగా 100 మంది ప్యానెల్ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్ సెల్లర్స్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ కోడ్స్‌ని సీజ్ చేశారు.

ఈ కార్యకలాపాల నుండి వచ్చే నల్లధనంలో వందల కోట్ల రూపాయలు భారతదేశం మరియు విదేశాలలో అనేక దేశ వ్యతిరేక మరియు నేర కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయని అధికారులు గుర్తించారు.దేశవ్యాప్తంగా 25 వేల మంది హ్యాకర్లు ఈ రాకెట్‌ లో భాగస్వాములుగా ఉన్నారని వారంతా టిక్కెట్ల కోసం డిమాండ్‌ను సృష్టించి విక్రేతలకు తీసుకువస్తున్నారని రైల్వే శాఖ పోలీసులు తెలిపారు.

ఈ అమ్మకందారులు ప్యానెల్ డెవలపర్‌లకు నెలవారీ ఛార్జీలపై సాఫ్ట్‌వేర్‌కు ప్రాప్యత ఇస్తారని నివేదించారు. ఈ ప్యానెల్ డెవలపర్లు ఆర్థిక మరియు సాంకేతిక నిర్వాహకులకు నివేదిస్తారు, దీని ప్రధాన పని విదేశాలలో హోస్ట్ చేసిన సర్వర్‌లను నిర్వహించడం" అని అధికారి తెలిపారు.