Mukesh Ambani (Photo-ANI)

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో తాజాగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ పేరుతో పేమెంట్ విభాగం రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. పేమెంట్‌ విభాగం సేవింగ్స్‌ అకౌంట్లను, బిల్‌ పేమెంట్‌ సర్వీసులను సంస్థ రీలాంచ్‌ చేసింది. త్వరలో డెబిట్‌ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

అమెజాన్ ఇండియాలో లక్ష ఉద్యోగాలు, పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు సృష్టించిన ఈ కామర్స్ దిగ్గజం

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్‌లోన్‌లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది.త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ షాక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా

ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సిద్ధం చేస్తోంది.