టెలికాం దిగ్గజం జియో కస్టమర్ల కోసం 15 ఓటీటీ ప్లాన్ తీసుకువచ్చింది. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు రూ.888తో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 15 రకాల ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ వినియోగదారులు ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది.ఈ ప్లాన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్ వస్తోంది. యూజర్లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్, అయితే ఈ మూడు ప్లాన్లలో ఉన్నవారికి మాత్రమే ఆఫర్
జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా (ఎయిర్ ఫైబర్‌కు వెయ్యి జీబీ/ జియో ఫైబర్‌కు 3300 జీబీ) లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 15 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. 800 డిజిటల్ టీవీ ఛానెళ్లు కూడా పొందొచ్చని జియో తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్ ధన్‌ధనా ధన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. దీని కింద జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కస్టమర్లు 50 రోజులు పాటు ఉచితంగా సేవలను ఆనందించొచ్చు. మే 31తో ఈ ఆఫర్ ముగియనుంది.