Jio launches 'Work From Home Pack' for Rs 251 (Photo-Ians)

Mumbai, Mar 22: కరోనా వైరస్ (Coronavirus) దేశ వ్యాప్తంగా పంజా విసురుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని (COVDI-19) నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) సరికొత్త ప్లాన్ తో వచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ (Jio Work From Home Pack).

కరోనా విశ్వరూపం, ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్లు మూసివేత

దీని కాలపరిమితి 51 రోజులుగా కాగా, ధరను రూ.251గా నిర్ణయించారు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 2 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజింగ్ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇదే తరహాలో కొత్త కస్టమర్లకు నెలరోజుల పాటు బ్రాడ్ బ్యాండ్ ఉచితమంటూ ఆఫర్ ప్రకటించింది.

టాప్‌అప్స్‌కు సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది. రూ 21 టాప్‌అప్‌ చేయిస్తే అంతకుముందు 1 జీబీ స్ధానంలో 2జీబీ డేటా, 200 నిమిషాల ఇంటర్‌నెట్‌ కాల్స్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపచేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

యస్ బ్యాంక్ సంక్షోభం, అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

ఇక కరోనా వైరస్‌ నిరోధించేందుకు ప్రభుత్వ సూచనలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో బ్రాడ్‌కాస్టింగ్‌, ఓటీటీ కంపెనీలు కూడా అత్యధిక వ్యూయర్లను, సబ్‌స్ర్కైబర్లను పొందుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో డేటాకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. మొత్తం ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ 10 శాతం పైగా పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు పేర్కొన్నారు.

గత కొద్ది రోజులుగా డాంగల్స్‌కూ డిమాండ్‌ రెట్టింపవడంతో రిటైలర్లు స్టాక్‌ తెప్పించేందుకు వారం సమయం కోరుతున్నారు. ఇంటర్‌నెట్‌ ట్రాఫిక్‌ 10 శాతం పెరిగిందని తమ టెలికాం సభ్యుల నుంచి సమాచారం అందిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మ్యాథ్యూస్‌ వెల్లడించారు.