JioPhone Prima 2 4G Feature Phone (Photo Credit: Amazon)

దేశీయ టెలికాం దిగ్గజం జియో భారత మార్కెట్లోకి జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో జియో ఆవిష్కరించిన జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా జియో ఫోన్ ప్రైమా 2 వస్తోంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.

జియో ఫోన్‌ ప్రైమా 2 (Jio prima 2) ఫోన్‌ను 2.4 అంగుళాల కర్వ్‌డ్‌ స్క్రీన్‌, కీ ప్యాడ్‌, క్వాల్‌కామ్‌ చిప్‌సెట్‌తో తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ సదుపాయం ఉంది. సింగిల్‌ న్యానో సిమ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ సారి ఫ్రంట్‌ కెమెరాతో తీసుకురావడం విశేషం. ఎల్ఈడీ టార్చ్ యూనిట్ గల ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా నేరుగా వీడియో కాలింగ్ కు మద్దతుగా ఉంటుంది.

రియల్ మీ నార్జో 70 టర్బో 5జీ మార్కెట్లోకి వచ్చేసింది, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

ఈ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా జియో పే యాప్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ యాప్స్ ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, వాట్సాప్‌, ఫేస్ బుక్, యూ-ట్యూబ్ కూడా పొందొచ్చు.జియో ప్రైమా 2 ధర రూ.2,799గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ రంగులో లభిస్తుంది. అమెజాన్‌ వేదికగా వీటిని బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 23 భాషలకు ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌ 3.5mm ఆడియో జాక్‌, 4జీ కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తుంది.