Motorola Edge 50 Pro Colours Revealed (Photo Credit: X, @motorolaindia)

ప్రముఖ మొబైల్‌ తయారీ దిగ్గజం మోటోరొలా (Motorola) కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఏఐ-బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 4ఎన్ఎం ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఫ్రంట్ తో పాటు వెనుక భాగంలో 50 ఎంపీ కెమెరాలతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వ్‌డ్‌ డిస్‌ఫ్లేతో పాటుగా 125W పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

అలాగే 50W వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అయితే 12జీబీ వేరియంట్‌తో మాత్రమే 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారు. బేస్‌ వేరియంట్‌తో 68W ఫాస్ట్‌ ఛార్జర్‌ మాత్రమే బాక్స్‌లో ఉంటుంది. ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. మూడేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.రూ. 25 వేల బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి మరొక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఆఫర్లు ఏమున్నాయి? ఇక్కడ తెలుసుకోండి!

ధర విషయానికి వస్తే..8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999లకు లభిస్తుంది. పరిచయ ఆఫర్ కింద 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999లకే అందిస్తుంది. ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఆన్ లైన్ స్టోర్, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి  ప్రారంభం అవుతాయి.

బ్లాక్ బ్యూటీ, లుక్స్ లావెండర్, మూన్ లైట్ పెరల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. HDFC క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుతో కొనుగోళ్లపై రూ.2,250 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. రూ.2000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఇస్తున్నారు.