New Delhi, April 20: ఓటీటీ సంస్థలలో రారాజుగా వెలుగుతున్న ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix). గత రెండు, మూడేళ్లుగా దీనికి దక్కుతున్న ఆదరణ, పెరుగుతున్న సబ్‌స్క్రైబర్లు బహుశా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు లేదెమో. ముఖ్యంగా హలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారికి నెట్‌ఫ్లిక్స్ ఒకటే ఆప్షన్‌లా మారింది. ఇక ఈ మధ్య ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను పెంచుకోవాలని కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో రీజినల్ సినిమాలను వరుసగా కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా మనకు అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చార్జీలలో మార్పులు కూడా తీసుకొచ్చింది. కాగా తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ వినియోగదారులకు గుడ్‌న్యూస్ (Netflix Cuts Subscription Rates) ప్రకటించింది. ఇండియాతో సహా 115 దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.199 ఉన్న మొబైల్ ప్లాన్‌ను రూ.149కి తగ్గించింది. అదేవిధంగా టీవీలు, కంప్యూటర్‌లతో పాటు ఎక్కడైనా యాక్సిస్ చేసుకోగలిగే ప్లాన్ ఛార్జీని రూ.499 నుంచి రూ.199కి తగ్గించింది. ఇక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకునే వారికి ఇవి సరసమైన ధరలనే చెప్పాలి.
నెట్‌ఫ్లిక్స్ సంస్థ లాభాలను పెంచుకునేందుకు గతంలో ఎన్నో వ్యూహాలను తీసుకొచ్చింది. కానీ అవేవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో తాజాగా మరో పద్దతిని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix Cuts Subscription) సంస్థ త్వరలోనే పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దీనివల్ల యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వ్యక్తులతో పంచుకుంటే ఎక్స్‌ట్రాగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది మొదట అమెరికాలో అందుబాటులోకి రానుంది. కొన్ని నివేదికల ప్రకారం 10 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతరుల ఖాతాలను వినియోగిస్తున్నారు.