FASTags with incomplete KYC to be deactivated post Jan 31: NHAI

New FASTag Rules From Today: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం ఈరోజు (August 1, 2024) నుండి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త రూల్స్‌ ప్రకారం మూడు నుంచి ఐదేండ్ల క్రితం జారీచేసిన ట్యాగ్‌లకు ఈ ఏడాది అక్టోబర్‌ 31లోగా తప్పనిసరిగా అప్‌డేట్‌ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

ఐదేండ్ల కంటే పాతవైన ఫాస్టాగ్‌లను (New FASTag Rules) వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది. యజమానులు తమ ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్‌, ఛాసిస్‌ నంబర్లకు డెడ్‌లైన్‌లోగా లింక్‌ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్త వాహనాల యాజమానులైతే రిజిస్ట్రేషన్‌ నంబర్లను 90 రోజుల్లోగా అప్‌డేట్‌ చేయాలి. 30 రోజుల గడువులోగా చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు.

దీంతో పాటుగా ఫాస్టాగ్‌ ప్రొవైడర్లకు కూడా ఎన్పీసీఐ అదనంగా పలు రూల్స్‌ తీసుకొచ్చింది. వాహనానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని వెరిఫై చేసి డాటాబేస్‌ను అప్‌డేట్‌ చేయాలి. సులభంగా గుర్తించేలా వాహనం ముందు, పక్కవైపు ఫొటోలను స్పష్టంగా అప్‌లోడ్‌ చేయాలి. కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉండాలంటే, ముఖ్యమైన అప్‌డేట్‌లతో సమాచారం అందించడం కోసం, ప్రతి ఫాస్ట్‌ట్యాగ్‌ని సంప్రదింపు నంబర్‌కి లింక్ చేయడం చాలా అవసరం.  ఎన్ హెచ్ఏఐ నిర్ణ‌యంతో 2.4 కోట్ల మందికి ఇబ్బంది, పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీ యాక్టివేట్ చేసుకోవాలంటే?

ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాల కోసం రూపొందించబడిన ప్రీపెయిడ్ సేవ, ఇది టోల్ బూత్‌ల వద్ద ఆపే లేదా వేచి ఉండాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. FASTag యొక్క KYC ధృవీకరణ ప్రారంభించడంతో, ఇది ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా టోల్ స్టేషన్‌ల ద్వారా సమస్యలు లేని డ్రైవ్‌ను నిర్ధారిస్తుంది.