No Mobile Number Fee To Be Charged: బహుళ సిమ్‌లు లేదా నంబరింగ్ రిసోర్స్‌లను కలిగి ఉన్నందుకు కస్టమర్‌లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వాదనలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మాత్రమే ఈ వార్త ఉపయోగపడుతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుక్రవారం పేర్కొంది.ఒకటి కంటే ఎక్కువ SIM కార్డ్‌లను కలిగి ఉన్నందుకు కస్టమర్‌లకు ఛార్జీ విధించదని ఎక్స్ వేదికగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలతో షియోమీ 14 సివి వచ్చేసింది, ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
నేషనల్ నంబరింగ్ ప్లాన్ రివిజన్‌పై కన్సల్టేషన్ పేపర్" పేరుతో తన పత్రికా ప్రకటనను అనుసరించి, రెండు సిమ్‌లు లేదా అంతకంటే ఎక్కువ ఉపయోగించే కస్టమర్‌లకు ఛార్జీ వసూలు చేస్తుందని పలు నివేదికలు తెలిపాయి. TRAI అనేక ఇతర దేశాల మాదిరిగా ఇన్ యాక్టివ్ SIM కార్డ్‌లకు పెనాల్టీని వసూలు చేస్తుందని వార్త నివేదించబడింది. అయితే యాక్టివ్ నంబర్ ప్రభావితం కాలేదని నివేదికలు తెలిపాయి. అయితే ఈ వార్తలు అన్నీ అవాస్తవమని ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఈ వార్తలన్నీ నిరాధారమైనవని ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది.