November9: ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ( e-commerce major Flipkart) ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ నోకియా(Nokia)తో కలిసి త్వరలో స్మార్ట్‌టీవీలను తయారు చేసి ఇండియా(India)లో లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే నోకియాతో భాగస్వామ్యం అయింది. ఇప్పటికే మోటోరోలాతో ఒప్పందం కుదుర్చుకున్నఫ్లిప్‌కార్ట్ నోకియాతో కూడా జతకట్టింది.
కాగా భారత్‌లో అనేక కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీ(Smart TVs)లు వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. ఇకపై నోకియా స్మార్ట్‌టీవీలు కూడా లభ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ నోకియా బ్రాండ్ పేరిట సదరు స్మార్ట్‌టీవీలను విక్రయించనుంది. ఈ టీవీలు అధునాతన ఫీచర్లతో రానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ తయారు చేయనున్న నోకియా స్మార్ట్‌టీవీ(Nokia Smart TVs)ల్లో జేబీఎల్ కంపెనీకి చెందిన సౌండ్ ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ మేరకు జేబీఎల్ మాతృసంస్థ హర్మాన్‌తో ఫ్లిప్‌కార్ట్, నోకియాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో హై క్వాలిటీ ఆడియో ఎక్విప్‌మెంట్ కలిగిన నోకియా స్మార్ట్‌టీవీలు త్వరలో భారత్‌లోని వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ టీవీలను ఎప్పుడు లాంచ్ చేయనున్నారనే వివరాలను ఆ కంపెనీలు వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..!