New Delhi, July 01: వాట్సాప్ యూజర్లు తరచూ ఎదుర్కొనే సమస్య చాట్ బ్యాకప్. డ్రైవ్‌లో స్పేస్ తక్కువగా ఉండటం వల్ల చాలామంది వాట్సాప్ చాట్ హిస్టరీని (Whatsapp Chat) బ్యాకప్ చేసుకోలేకపోతున్నారు. దీంతో రెగ్యులర్ టైమ్‌లో సమస్య లేకపోయినప్పటికీ.. ఫోన్ మార్చినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ డేటాను పాత ఫోన్‌లో నుంచి కొత్త ఫోన్‌లోకి మార్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇకపై ఆ సమస్యలు ఏవీ లేకుండా వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఒక్క క్యూఆర్ కోడ్‌ను స్కాన్ (OR Scan) చేయడం ద్వారా పాత ఫోన్‌లో నుంచి కొత్త ఫోన్‌లోకి చాట్ హిస్టరీని పంపించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ అచ్చం షేర్ ఇట్ తరహాలోనే పనిచేయనుంది. మీ పాత, కొత్త మొబైల్స్ రెండూ కూడా ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ పనిచేస్తుంది.
PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్ మీకోసం..
ఈ ఫీచర్ ద్వారా డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటే ముందుగా.. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని చాట్ ఆప్షన్ క్లిక్‌చేయాలి. అనంతరం చాట్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. దాంతో కొత్త మొబైల్‌లోని వాట్సాప్ యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అంతే చిటికెలో పాత మొబైల్‌లోని వాట్సాప్ డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ మేరకు వాట్సాప్‌లో డేటాను రెండు ఫోన్ల మధ్యలో ఎలా బదిలీ చేసుకోవాలో చెబుతూ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు.
అయితే ఇలా ట్రాన్స్‌ఫర్ చేసే హిస్టరీ మొత్తం ఎన్‌క్రిప్ట్ మోడ్‌లోనే ఉంటుందని వాట్సాప్ సంస్థ తెలిపింది. ఆ సమాచారం ఇతరులకు షేర్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే సాధారణ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.