PAN-Aadhaar Linking Deadline Ends Today: పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.
పంచాయతీ పనులకు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం
నిర్ణిత సమయంలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ నంబర్ పనిచేయదు. దీంతో పాన్ ఉపయోగించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే, పాన్ కార్డు పనిచేయకపోవడంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ చేయని వారు ఆదాయపు పన్ను శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి పాన్, ఆధార్ నెంబర్, మిగతా వివరాలను నమోదు చేసి లింక్ చేసుకోవచ్చు.
ఆధార్‌కు పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే..
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ లో క్విక్ లింక్ సెక్షన్ లో ఉన్న ఆధార్ స్టేటస్ ఆప్షన్ ను ఎంచుకోండి.
వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
సర్వీస్ పై పాన్, ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది. మీ ఆధార్, పాన్ నంబర్లు ఎంటర్ చేయండి
మీ ఆధార్ ను పాన్ కు లింక్ చేసినట్టయితే లింక్ చేయబడిందని, ఒకవేళ చేయకపోతే చేయలేదని చూపిస్తుంది.