చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తోపాటు 8 జీబీ ర్యామ్ తో వస్తోంది. తొలిసారి మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ సర్టిఫికేషన్ ఉంటుంది. 360-డిగ్రీ డామేజ్ ప్రూఫ్ ఆర్మౌర్ బాడీగా అందుబాటులో ఉంటది. తడి చేతులతో ఫోన్ వాడుతున్నప్పుడు స్ప్లాష్ టెక్నాలజీకి మద్దతు ఉంటుంది.బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ రంగుల్లో లభిస్తుందీ స్మార్ట్ ఫోన్.
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999గా ఉంది. ఆగస్టు రెండో తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మూడు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఆగస్టు రెండో తేదీ వరకూ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, డ్యుయల్ రీఇన్ ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్ పై పనిచేస్తుందీ ఫోన్.
ఒప్పో కే12ఎక్స్ 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ – 32 మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 5జీ, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటిక్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.