New Delhi, October 30: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ పై (China Mobile Apps) ఇండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే పబ్జీ మొబైల్ పై (PlayerUnknown’s Battlegrounds) నిషేధం విధించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న ఈ మొబైల్ గేమ్ ని (PUBG MOBILE) సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించింది. నిషేధం గురించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా పబ్జీ మొబైల్ చాలామందికి అందుబాటులో ఉండింది.
తాజా సమాచారం ప్రకారం పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. అక్టోబర్ 30వ తేదీ ఇండియాలో పబ్జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. పబ్జీకి సంబంధించి ఎలాంటి సేవలు కూడా అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. మొత్తానికి ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న గేమ్ షో ఇక నుండి ఇండియాలో అందుబాటులో ఉండదన్నమాట.
ఇకపై డౌన్‌లోడ్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడటం సాధ్యం కాదు. అక్టోబర్ 30 నుంచి ఇండియాలో తమ సేవల్ని నిలిపివేస్తామని, యూజర్లను తొలగిస్తామని టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసుకున్నవారితో పాటు ఏపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నవారు కూడా ఈ గేమ్ ఆడలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నుంచి ఇండియాలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ఏ రకంగానూ పనిచేయవు. ఇక పబ్‌జీ మొబైల్‌కు సంబంధించిన పబ్లిషింగ్ రైట్స్‌ని పబ్‌జీ కార్పొరేషన్‌కు అందిస్తున్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో పబ్‌జీ మొబైల్ ఇండియా వెల్లడించింది.
మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వివరించింది. యూజర్ల డేటా, సెక్యూరిటీ ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వాటిలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్‌తో పాటు టిక్ టాక్, వీచాట్, క్యామ్ స్కానర్ లాంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి