Realme GT 6T (Photo Credits: X/@realmeIndia)

ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం రియల్‌మీ (Realme) జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ను ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌ల్లో ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి.

రియల్ మీ జీటీ 6టీ (Realme GT 6T) ఫోన్‌ గ్లోసీ ఫినిష్‌తోపాటు సిల్వర్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది.120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ తో 8టీ ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, థర్డ్ సర్క్యులర్ ఐలాండ్ మీద డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్స్,  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌, 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్, రైట్ ఎడ్జ్ మీద పవర్ బటన్లు, వాల్యూమ్ రాకర్లు, బాటం ఎడ్జిపై స్పీకర్ గ్రిల్లె, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తదితర ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 31,999 ఉంటుందని సమాచారం.  బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా iPhone 15 Pro Max, రెండవ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా Samsung Galaxy S24 సిరీస్

ఐపీ65 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్, 32-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 సెన్సర్ కెమెరాతో వస్తున్నదీ ఫోన్. వై-ఫై 6, బ్లూ టూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ కెపాసిటీతో వస్తుందని భావిస్తున్నారు.