ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌ (Reddit) ఉద్యోగుల (employees) తొలగింపుకు సిద్ధమైంది.ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రెడ్డిట్‌ ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగుల్ని కలిగిఉంది. అందులో దాదాపు 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు (lay off) తెలుస్తోంది. కంపెనీ నిర్ణయంతో 90 మందిపై లేఆఫ్స్‌ (Lay Offs) ప్రభావం పడనుంది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో స్టీవ్‌ హుఫ్‌మన్‌ (Steve Huffman) తమ ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేశారు.

ఇదే సమయంలో నూతనంగా నియమించుకునే సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగానే మొదట 300 మంది కొత్తవాళ్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ సంఖ్యను 100కే పరిమితం చేసింది.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)