jio-phone-users-get-all-one-prepaid-plans-jiophone (Photo Credit: Official Website)

రిలయన్స్‌ జియో మరో సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో ఫోన్‌ ప్రీ పెయిడ్‌ యూజర్లుకోసం 'బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌' ఆఫర్ (Reliance Jio Buy 1 Get 1 Offer) అందుబాటులోకి తెచ్చింది. ఉదాహరణకు జియో ఫోన్‌ యూజర్లు (JioPhone users) రూ.125తో రిఛార్జ్‌ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.

కొత్తగా వచ్చి ఆఫర్ ప్రకారం.. రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్‌లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.69 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 14రోజుల పాటు ప్రతీ రోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.

రూ.75 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది. ఆఫర్‌లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు. రూ.125 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.155 రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌,28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.

వాట్సాప్‌కు షాకిచ్చిన టెలిగ్రాం, ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే ఫీచర్ అందుబాటులోకి, వీడియోలను షేర్‌ చేసేలా మరో కొత్త ఫీచర్‌

రూ.185 రీఛార్జ్‌ ప్లాన్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్‌ జియో ఆఫర‍్లను ప్రకటించింది. ఇటీవల ట్రాయ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్‌టెల్ 46.13 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు.