(Photo-Twitter)

రిలయన్స్ జియో సంస్థకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో మొబైల్ యూజర్లు జియోను (Reliance Jio) వదిలి వెళ్లారు. గత నెలతో పోలిస్తే డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ డేటా గురువారం వెల్లడించింది. రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను (Reliance Jio loses 1.29 cr mobile subscribers) కోల్పోయింది. డిసెంబర్ 2021లో దాని మొబైల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయినట్లు ట్రాయ్ వెల్లడించింది.

మరో వైపు వోడాఫోన్ ఐడియా కూడా 16.14 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, డిసెంబర్ 2021లో దాని బేస్ 26.55 కోట్లకు చేరుకుంది. జియో, వోడాఫోన్ ఐడియా కు యూజర్లు గట్టి షాక్ ఇవ్వగా...మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కు యూజర్లు జోష్ నింపారు . టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన నెలవారీ సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది (Airtel adds 4.75 lakh ) కొత్త వినియోగదారులను పొందింది. దీంతో వినియోగదారుల సంఖ్యను 35.57 కోట్లకు పెంచుకుంది.

వాట్సాప్‌ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే! రూ. 20 లక్షలు ఫైన్, ఐదేళ్లు శిక్ష, కొత్త చట్టం ఎక్కడ తెచ్చారో తెలుసా?

దిగ్గజ టెలికాం సంస్ధలు 20 శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నా విషయం తెలిసిందే. దీంతో ఆయా యూజర్లు ఇతర నెట్ వర్క్నుకు మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇదే నెలలో ప్రైవేట్ సంస్థల కంటే ఎక్కువ లబ్ధి పొందింది.