5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టాప్‌లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (Reliance Jio signals 5G blitz) జియో భారీగా డిపాజిట్ చేసింది. జియో ఏకంగా 14 వేల కోట్లను డిపాజిట్ చేసింది. టెలికం సంస్థలు మొత్తం రూ. 21,800 కోట్లు ఈఎండీగా చెల్లించగా, ఇందులో 14,000 కోట్లతో (₹14k cr auction deposit) జియో టాప్‌లో నిలిచింది. భారతి ఎయిర్‌టెల్ (Airtel) రూ. 5,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్ రూ. 100 కోట్లు డిపాజిట్ చేశాయి.
బిలియనీర్ అదానీకి భిన్నంగా, అంబానీకి చెందిన రిలయన్స్ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్ లిమిటెడ్ ₹14,000 కోట్లను డిపాజిట్ చేయడం ఆసక్తికర అంశం. 14,000 కోట్లతో, వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌లో మూడింట ఒక వంతు, 1.4 ట్రిలియన్ విలువైన స్పెక్ట్రమ్‌ను జియో కొనుగోలు చేయవచ్చు. జియో డిపాజిట్ భారీ స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రణాళికను సూచిస్తుందనీ, దీనికితోడు ఇప్పటికే 4G ఫ్రీక్వెన్సీల కోసం మునుపటి వేలంలో 57వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది, ఇక 4జీ లేదా ఇతర బ్యాండ్స్ ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
మరోవైపు గౌతమ్ అదానీ టెలికా రంగంలో ప్రవేశాస్తున్నారన్న ఊహాగానాలు ప్రత్యర్థి టెల్కోలను ఆందోళనకు గురి చేశాయి, ఆరేళ్ల క్రితం ముకేశ్ అంబానీ జియో ఎంట్రీ, సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదానీ పోటీకి దూరంగా ఉన్నారనీ, 3.5 GHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని భావించడం లేదని పేరు చెప్పడానికి అంగీకరించని టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. ఆదాని గ్రూపు 650-700 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయనుంది, కానీ ప్రస్తుతానికి, వినియోగదారుల సేవల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు.