
New Delhi, July 19: దేశంలో క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని ఆర్బీఐ కోరుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. క్రిప్టో కరెన్సీల వల్ల దేశ ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలోనే క్రిప్టో కరెన్సీలపై (Cryptocurrency) చట్టం తేవాలని భారతీయ రిజర్వు బ్యాంక్ సిఫారసు చేసింది, ఆర్బీఐ ఆలోచన ప్రకారం క్రిప్టో కరెన్సీలను నిషేధించాల్సిందేనని సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో (Sitharaman Tells Lok Sabha) ఆమె తెలిపారు.
అయితే దేశంలో పరిస్థితులు దృష్ట్యా ఇప్పట్లో క్రిప్టో కరెన్సీ నిషేధం సాధ్యం కాదని ఆమె (Finance Minister Nirmala Sitharaman) స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీలతో రిస్క్, బెనిఫిట్లపై అంతర్జాతీయ సమాజం సహకారంతో చర్చించి ఉమ్మడి పన్ను విధానం, ప్రమాణాలు ఖరారు చేశాకే వాటిపై నిషేధం విధించడం సాధ్యమన్నారు.అంతర్జాతీయ సమాజ సహకారంతో నిషేధం విధిస్తే సమర్థవంతమైన ఫలితాలు వస్తాయన్నారు.
నిర్మలా సీతారామన్‌కు కరోనా, రాష్ట్రపతి ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి ఓటేసిన కేంద్ర ఆర్థిక మంత్రి
లేదంటే క్రిప్టో కరెన్సీపై ఎలాంటి పై చేయి సాధించలేమని నిర్మలా తెలిపారు. క్రిప్టో కరెన్సీలు కరెన్సీలు కావని ఆర్బీఐ గుర్తుచేసిందన్నారు. కాగా వర్చువల్ కరెన్సీ లావాదేవీలను నిషేధిస్తూ 2018 ఏప్రిల్ ఆరో తేదీన ఆర్బీఐ సర్క్యులర్ కూడా జారీ చేసింది. కానీ 2020 మే నాలుగో తేదీన ఆర్బీఐ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు పక్కన బెట్టేసింది.