కరోనావైరస్ దేశంలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో తమ యూజర్ల కోసం జియో సరికొత్త కోవిడ్ ఆఫర్లను (Jio Covid Offers) ప్రకటించింది. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను (Reliance Jio Covid Offers) ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌ను (Jio Phone Users to Get 300 Minutes of Free Calling) అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్(రోజుకు10 నిమిషాలు) ఉచితంగా ఇవ్వనుంది.
అలాగే జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనుంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు. ఇందుకు రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రతీ భారతీయుడికి డిజిటల్ లైఫ్ అందించే లక్ష్యంతో జియోఫోన్‌ను తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభకాలంలో వారికి ఎఫర్డబుల్ ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని జియో వెల్లడించింది ఈ కాలంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయని జియో తెలిపింది.