RIL-Airtel Spectrum Agreement: జియో-ఎయిర్‌టెల్‌ మధ్య తొలి డీల్, ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్‌‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేయనున్న జియో, ట్రేడింగ్‌ ఒప్పందం విలువ రూ .1,497 కోట్లు
airtel-jio-enable-vowi-fi-calling-all-about-wi-fi-based-calling-android-ios-phones (Photo-Wiki)

టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం (RIL-Airtel Spectrum Agreement) కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కి ఉన్న 800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రిల్ (spectrum agreement with Bharti Airtel) సంస్థ తెలిపింది.

ఈ స్పెక్ట్రంను ఉపయోగించుకునే హక్కు కోసం మొత్తం విలువ రూ .1,497 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్‌కు జియో సుమారు రూ.1,038 కోట్లు చెల్లిస్తుంది. అలాగే సదరు స్పెక్ట్రంనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.459 కోట్లు కూడా చెల్లిస్తుంది.

‘800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 3.75 మెగా హెర్ట్జ్, ఢిల్లీలో 1.25 మెగా హెర్ట్జ్, ముంబైలో 2.50 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రంను వినియోగించుకునే హక్కులను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు బదలాయించేందుకు ఒప్పందం కుదిరిందని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 41.07 కోట్ల యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, 34.46 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌తో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది.

ఎస్‌బీఐ యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ ఆఫర్లు, ఏప్రిల్‌ 7వ తేదీ వరకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లు, మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి

ఈ డీల్ ద్వారా ఈ సర్కిల్స్‌లో జియో 4జీ సేవలు మరింత పటిష్ఠం అవుతాయని భావిస్తున్నారు. అయితే ఈ ట్రేడింగ్‌ ఒప్పందానికి ప్రభుత్వం, ట్రాయ్‌ వంటి రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది. టాటా టెలిసర్వీసెస్‌ విలీనంతో ఈ సర్కిల్స్‌లో ఎయిర్‌టెల్‌కు ఈ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌లో మిగులు ఏర్పడింది. అందులో కొంత భాగాన్ని జియోకు విక్రయించింది.