Samsung Galaxy M01 Core Smartphone Launched in India (Photo Credits: Samsung India)

New Delhi, July 27: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా రూ. 6 వేల లోపు ధరతో ‘గెలాక్సీ ఎం01 కోర్’ను (Galaxy M01 Core) విడుదల చేసింది. భారత్‌లో లభ్యమయ్యే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత చవకైన ఫోన్. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీలతో రెండు వేరియంట్లు తీసుకొచ్చింది. ఇందులో మొదటి దాని ధర ( Galaxy M01 Core Price) రూ. 5,499 కాగా, రెండో దాని ధర రూ. 6,499 మాత్రమే. ఈ నెల 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. రూ.25 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ నార్డ్‌ను విడుదల చేసిన కంపెనీ, ఆగస్టు 4 నుంచి ఇండియాలో అమ్మకాలు

స్పెసిఫికేషన్ల (Galaxy M01 Core Specifications) విషయానికొస్తే.. 5.3 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాడ్‌కోర్ మీడియా టెక్ 6739 ప్రాసెసర్‌ను (MediaTek 6739) ఉపయోగించిన ఈ ఫోన్‌లో స్మార్ట్ పేస్ట్, సజెస్ట్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లో బ్యాటరీ సమయంలో సజెస్ట్ నోటిఫికేషన్ హెచ్చరిస్తుంది.

వెబ్ బ్రౌజర్‌లో వెబ్‌సైట్ యూఆర్ఎల్, ఫోన్ డయలర్‌లో మొబైల్ నంబర్, మెయిల్ అప్లికేషన్లలో మెయిల్ ఐడీ వంటి వాటిని స్మార్ట్‌పేస్ట్ ఫీచర్ స్వయంచాలకంగా పేస్ట్ చేస్తుంది. అలాగే, ‘ఇంటెలిజెంట్ ఫొటోస్’ అనే మరో ఫీచర్ కూడా ఉంది. ఇది ఒకే రకంగా ఉన్న ఫొటోలను గుర్తించి వినియోగదారుడికి చెబుతుంది. ఫలితంగా వాటిని డిలీట్ చేయడం ద్వారా స్పేస్‌ను పెంచుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ గో తాజా ఓఎస్‌ ద్వారా ‘గెలాక్సీ ఎం01 కోర్’ పనిచేస్తుంది.