Close
Search

Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.

సైన్స్ Hazarath Reddy|
Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..
Aditya-L1 Mission (Photo-X ISRO)

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింద%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A1%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8+%E0%B0%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B+%E0%B0%9A%E0%B1%80%E0%B0%AB%E0%B1%8D+%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D+%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5%E0%B1%8D%2C+%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF+%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E2%80%8C%E2%80%931+%E0%B0%89%E0%B0%AA%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%82+%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81+%E0%B0%87%E0%B0%B5%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B.. https%3A%2F%2Ftelugu.latestly.com%2Ftechnology%2Fscience%2Faditya-l1-launch-date-and-time-heres-when-isro-will-launch-indias-solar-mission-to-study-sun-106609.html',900, 600)">

సైన్స్ Hazarath Reddy|
Aditya-L1 Mission: సూర్యునిపై పరిశోధనకు సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం విశేషాలు ఇవిగో..
Aditya-L1 Mission (Photo-X ISRO)

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది.రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చామని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.

ఆదిత్య-L1 వ్యోమనౌక భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 (సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్) వద్ద సౌర వాతావరణం రిమోట్ పరిశీలనలు, సౌర గాలి యొక్క ఇన్-సిటు పరిశీలనలను అందించడానికి రూపొందించబడింది. ఇది బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్న అంతరిక్ష సంస్థ ద్వారా ప్రారంభించబడిన సూర్యుని పరిశీలనల కోసం అంకితమైన మొట్టమొదటి భారతీయ అంతరిక్ష మిషన్ అవుతుంది.

ఇక సూర్యునిపై వేట, సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్

ఆదిత్య-L1 మిషన్, L1 చుట్టూ ఉన్న కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే లక్ష్యంతో, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని యొక్క బయటి పొరలను, వాతావరణంను వివిధ వేవ్‌బ్యాండ్‌లలో పరిశీలించడానికి ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. ఆదిత్య-ఎల్1 అనేది జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ ప్రయత్నమని ఇస్రో అధికారి తెలిపారు.

ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం ప్రత్యేకతలు

భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్‌ పాయింట్‌–1 (ఎల్‌1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజియన్‌ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజియన్‌1 పాయింట్‌లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు

సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్‌1 అధ్యయనం చేస్తుంది. సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్‌ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్‌ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. మొత్తం ఏడు పేలోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ పేలోడ్‌ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.

సిటీ పెట్రోల్ డీజిల్
View all
Currency Price Change