NewDelhi, September 16: భారీ గ్రహ శకలం (Asteroid) ఒకటి అత్యంత వేగంగా భూమిపైకి దూసుకొస్తోంది. దీని పేరు 2005 ఆర్ఎక్స్3 (2005 RX3). పొడవు 210 మీటర్లు. అంటే మన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ (182 మీటర్లు)’ (Statue of Unity) పొడవుకంటే ఎక్కువ. గంటకు 62,820 కిలోమీటర్ల వేగంతో ఈ గ్రహ శకలం భూమిపైకి దూసుకొస్తోంది. అంతమాత్రాన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోనుండడంతో మనకు పెను ప్రమాదం తప్పినట్టే. ఇది 2005లోనూ ఒకసారి ఇది భూమికి దగ్గరగా వచ్చింది. అప్పటి నుంచి దీనిపై కన్నేసిన శాస్త్రవేత్తలు దానిని గమనిస్తూ వస్తున్నారు.
నేటి నుంచి ఐదు రోజులపాటు ఏపీలో పలు రైళ్ల రద్దు.. కారణం ఏమిటి? రద్దైన సర్వీసులు ఏంటి?
సూర్యుడి (Sun) చుట్టూ ఓ ప్రత్యేక కక్ష్యలో తిరుతున్న ఈ గ్రహశకలం మార్చి 2036లో మళ్లీ భూమికి చేరువగా వస్తుందని చెబుతున్నారు. 2005 ఆర్ఎక్స్3తోపాటు మరో నాలుగు గ్రహ శకలాలు ఈ వారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.