Train (Representational Image. Source-Twitter)

Vijayawada, September 16: నేటి నుంచి ఈ నెల 20 వరకు ఏపీలోని విజయవాడ (Vijayawada) మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి (Cancelled). నిర్వహణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267/17268), కాకినాడ-విజయవాడ (17257/17258), విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-తెనాలి (07887), విజయవాడ-గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), తెనాలి-రేపల్లె (07888), రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890), తెనాలి-విజయవాడ(07630) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

వైరల్ వీడియో, అధిక ఛార్జీ వసూలు చేసినందుకు కండక్టర్‌ను చితకబాదిన ప్రయాణికుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల (07781/07780) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రద్దు చేశారు.