Shenzhou 19 Manned Space Flight

Beijing, OCT 30: చైనా డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19 మిషన్ (Shenzhou 19) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాయువ్య చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి తెల్లవారు జామున 4.27 గంటలకు ( చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అంతరిక్ష యాత్రకు (Space tour) బయలుదేరిన వారిలో ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్ తో సహా ముగ్గురు వ్యోమగాములు (Manned Spaceflight Mission) ఉన్నారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల తరువాత వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములందరూ క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతం అయిందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ తెలిపింది.

China Successfully Launches Shenzhou 19

 

షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబే, వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు అతను 2022 సంవత్సరంలో షెంజౌ-14 మిషన్ లో అంతరిక్షంలో ప్రయాణించాడు. మొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన చైనా వ్యోమగాముల మూడవ బ్యాచ్ లో భాగమైన సాంగ్, వాంగ్ ఇద్దరూ 1990లో జన్మించారు. వాంగ్ ప్రస్తుతం చైనాకు చెందిన ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్. అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని ఏజెన్సీ తెలిపింది.