Newdelhi, June 30: ఆయుష్షు (Live) పెరగడానికి ప్రతిరోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు (Multivitamin Supplements) తీసుకొంటున్నారా? అయితే, అదంతా మీ భ్రమే. మల్టీవిటమిన్ సప్లిమెంట్లతో ఆయుష్షు పెరగడం కాదు.. త్వరగా మరణించే ముప్పు పెరుగొచ్చు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏండ్ల పాటు ఈ అధ్యయనంలో తేల్చి చెప్పారు. ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లు ఉపయోగపడటం లేదని, మరణ ముప్పును ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు.
భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో
Daily Multivitamin Supplements Do Not Help You Live Longer, Study Finds https://t.co/LbTiZb1uNr
— NDTV (@ndtv) June 28, 2024
మల్టీవిటమిన్ల కంటే ఆహారమే మేలు
మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని వాళ్ళు తెలిపారు.