Geminid Meteor Shower 2022:W ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం, స్పష్టంగా కనిపించనున్న జెమినిడ్ ఉల్కాపాతం, జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూసే అవకాశం
ఈ రోజు రాత్రి వినువీధిలో అద్భుతం చోటు చేసుకోనుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో అద్బుతాన్ని ఆవిష్కరించనుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం (Geminid Meteor Shower) చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ రోజు రాత్రి వినువీధిలో అద్భుతం చోటు చేసుకోనుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో అద్బుతాన్ని ఆవిష్కరించనుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం (Geminid Meteor Shower) చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయానికి చంద్రుడి వెలుగు ప్రసరణ క్రమంగా తగ్గుతుంటుంది. కనుక ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
సాధారణంగా గంటకు 150 ఉల్కలు (meteor shower) భూ వాతావరణంలో వచ్చి మండిపోవడం, అవి వెలుగులుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇంకా మరింత స్పష్టంగా చూడాలంటే, నగర, పట్టణాలకు వెలుపల నివసించే వారు, పల్లె వాసులకు ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం ఉండదు కనుక. పైగా పట్టణాల్లో లైట్ల కాంతి ఆకాశంలోని విశేషాల స్పష్టతకు అడ్డు పడుతుంది.
జెమిని ఉల్కాపాతాన్ని ఏ పరికరం అవసరం లేకుండా కంటితో చూడగలరు. ప్లే స్టోర్ లో ఇంటరాక్టివ్ స్కై మ్యాప్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో జెమిని కానస్టల్లేషన్ అని టైప్ చేస్తే విశేషాలు కళ్లముందుంటాయి. జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూడొచ్చు. కాకపోతే మరింత కాంతివంతంగా, స్పష్టంగా చూడాలంటే నేడు, రేపు అనుకూలం. అర్ధరాత్రి సమయానికి నడి నెత్తిన, తెల్లవారు జామునకు ముందు పడమర వైపునకు ఈ ఉల్కాపాతం దిశ మారిపోతుంది.
(The above story first appeared on LatestLY on Dec 14, 2022 03:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

