Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి
Missile. Representational Image (Photo Credits: Twitter)

Balasore, Dec 22: చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం (APJ Abdul Kalam Island) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిప‌ణి ఒక టన్ను వరకు వార్‌హెడ్‌ని మోసుకెళ్లగలదు.

ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లంలోని ల‌క్ష్యాల‌ను చేధించే సామ‌ర్థ్యంగ‌ల బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌ళ‌య్‌ని (Pralay Missile) భార‌త్ విజ‌య‌వంతంగా ప‌్రయోగించిందని.. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) అధికారులు ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణి ఘన ఇంధ‌నంతో ప‌నిచేస్తుంది. ఇండియ‌న్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన‌ పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని రూపొందించారు.

గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీజే అబ్దుల్ క‌లాం ఐలాండ్ నుంచి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించారు. కాగా, క్షిప‌ణి ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన డీఆర్‌డీవో బృందాన్ని ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.