Newdelhi, June 24: అదో మొక్క (Plant). పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. సైకాడ్ జాతికి చెందినది. సౌతాఫ్రికాలోని (South Africa) గోయె అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతి చెట్లు డైనోసర్ల కంటే ముందు నుంచి భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఒకట్రెండు మొక్కలే మిగిలాయి అనుకుంటున్నారు. గోయె అటవీ ప్రాంతంలో ఇటీవలే ఒక మగ ఎన్సెఫాలార్టోస్ వూడీ ను పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోనే ఒంటరిదిగా గుర్తింపు పొందిన ఈ మొక్కను పునరుత్పత్తి చేసి వాటి సంఖ్యను పెంచేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఈ పురుష మొక్కకు భాగస్వామిగా ఒక ఆడ మొక్కను అన్వేషిస్తున్నారు. ఈ పనికి కృత్రిమ మేధ(ఏఐ) సాయం కూడా తీసుకుంటున్నారు.
Single and Ready to Mingle: World's Loneliest Plant Seeks Mate https://t.co/jRdePsyC6A
— ExplorersWeb (@ExplorersWeb) May 31, 2024
10 వేల ఎకరాల్లో జల్లెడ
అంతరించి పోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కను సహజ పద్ధతి ద్వారా పునరుత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం ఇదే జాతికి చెందిన ఒక ఆడ మొక్క కోసం 10 వేల ఎకరాల గోయె అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.