Representational Image | (Photo Credits: Unsplash)

Prakasam, Feb 20: పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు (Electric Fence) తగిలి ఓ పులి (Tiger) మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని (Cooked) తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా (Prakasam) పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్న 12 మందిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం.. మహిళా కమిషన్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం.. వీడియోతో