Credits: Google

Hyderabad, Feb 20: హైదరాబాద్ (Hyderabad) లో దారుణం జరిగింది. వివాహితను (Married Women) కిడ్నాప్ (Kidnap) చేసి, ఆపై మత్తుమందు ఇచ్చిన దుండగులు ఆమెపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. ఘాతుకానికి పాల్పడిన అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ (Vikarabad) జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం పీరం చెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్త కూలి పనులకు వెళ్తుండగా, భార్య (29) ఓ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తోంది. పని ఇప్పిస్తామని నమ్మించిన బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైవేటు ఉద్యోగి అయిన సుమిత్ కుమార్ శర్మ (33)  ఆమెను కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నిరాడంబరుడిగా పేరు, సంతాపం తెలిపిన అన్ని పార్టీల నేతలు

అనంతరం మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్, మద్యం ను బలవంతంగా తాగించారు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత  ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కుని వదిలి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.

ప్రభాస్ కొత్త మూవీ బిగ్గెస్ట్ అప్‌డేట్! వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రెబల్ స్టార్, రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రాజెక్ట్ కే

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సైబరాబాద్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు.