Newdelhi, Oct 4: మద్యం (Alcohol) సేవించటం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా హాల్స్ లో ఎంత ప్రచారం చేసినా మందుబాబులు మారడంలేదు. అయితే, మద్యపానం వల్ల అనారోగ్యమే కాదు ఆరు రకాల క్యాన్సర్లు (Cancers) కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్ పరిశోధకులు వెల్లడించారు. మద్యపానం వల్ల మన డీఎన్‌ఏ కూడా దెబ్బతినే చాన్స్ ఉన్నదని తెలిపారు. 2019 డాటా ప్రకారం ప్రతి 20 మందిలో ఒకరు మద్యం సేవించటం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారేనని వివరించారు.
మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)
Could your drinking habits be putting you at cancer risk?https://t.co/P6KCE8atke
— WION (@WIONews) October 3, 2024
ఈ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం
- పేగు క్యాన్సర్
- ఉదర క్యాన్సర్
- రొమ్ము క్యాన్సర్
- కాలేయ క్యాన్సర్
- అన్నవాహిక క్యాన్సర్
- హెడ్ అండ్ నెక్ క్యాన్సర్