Sophos Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో దిగ్గజం, 450 మందిని ఇంటికి సాగనంపుతున్న సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్
Sophos (Photo Credit- Twitter)

సైబర్-సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాని శ్రామిక శక్తిలో 10 శాతం అంటే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 450 మందిని ఇంటికి సాగనంపుతోంది. UK ప్రధాన కార్యాలయం ఉన్న సోఫోస్‌లో తొలగింపుల గురించి టెక్ క్రంచ్ మొదట నివేదించింది. అయితే కంపెనీ ఖచ్చితమైన తొలగింపు సంఖ్యను వెల్లడించలేదు. మార్చి 2020లో, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ థామా బ్రావో.. సోఫోస్‌ను $3.9 బిలియన్ల డీల్‌లో కొనుగోలు చేసింది.

అధిక నిధులు ఉన్నా ఉద్యోగాల కోత విధించిన మరో టెక్ దిగ్గజం, కంపెనీ విడిచి వెళ్లాలని సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు మెయిల్ పంపిన ఐసెర్టిస్

మేనేజ్డ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (ఎమ్‌డిఆర్)" వంటి సేవలపై ఎక్కువ దృష్టి పెట్టడం ఉద్యోగాల కోతకు కారణమని సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది.కాగా గత ఏడాది మార్చిలో ముంబైలో సోఫోస్ తన కొత్త డేటా సెంటర్‌ను ప్రారంభించింది ఇది. ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతంలో ఇండియా డేటా సెంటర్ సోఫోస్ యొక్క మూడవది ఇది. మిగిలిన రెండు ఆస్ట్రేలియా, జపాన్‌లో ఉన్నాయి.