Telugu Typing in Android Mobiles

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ అనేది కామన్ అయిపోయింది. ఈ పోన్ ద్వారా ఛాటింగ్, మెసేజ్, పేమెంట్స్ లాంటి వన్నీ చేసేస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో టైపింగ్ అనేది కేవలం ఇంగ్లీష్‌ భాషలోనే ఉంటుంది. వారి వారి సొంత భాషల్లో టైప్ చేయాలంటే ఒక్కోసారి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మన మాతృభాష తెలుగులో మెసేజ్‌లను (Telugu Typing in Android Mobiles) ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని గురించి ఇతరులకు చెప్పరు .అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ (How to type in Telugu in android mobile phone) చేసే మార్గాలు ఉన్నాయి. మీరు ఎలా చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం ఓ సారి ప్రయత్నించి చూడండి.

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుండి గూగుల్ ప్లే స్టోర్‌లో కెళ్లి Google Indic Keyboardని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ కీ బోర్డ్ ఆండ్రాయిడ్ Android 4.1.2 పైన ఓఎస్ లకు సపోర్ట్ చేస్తుంది. అనంతరం Google Keyboard ను అప్డేట్ చేయండి. అప్ డేట్ చేసిన తరువాత, మీ ఫోన్లో Settings > Language/Input Tools > Google Keyboard settings ను ఓపెన్ చేయండి. అందులో Languages ను సెలక్ట్ చేసుకుని , English తో పాటుగా, తెలుగు ని కూడా సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు మీ కీబోర్డ్ లో కనిపించే గ్లోబ్ గుర్తు పై క్లిక్ చేయండి. వెంటనే మీరు English/Telugu Keyboard కి మారవచ్చు.

సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి

తెలుగు కోసం గ్లోబ్ మీద టాప్ చేయగానే మీకు అన్ని అక్షరాలతో కూడిన పదాలు కనిపిస్తాయి. మీరు ఏ పదం కావాలనుకుంటున్నారో దాన్ని టాప్ చేస్తే సరిపోతుంది. మీరు అక్షరం టైపై చేయగానే ఆటోమేటిగ్గా వత్తులు కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. పక్కనే 123 నంబర్స్ అలాగే కొన్ని గుర్తులు కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు కీబోర్డ్ టైప్ చేయాలనుకుంటే అక్కడ కనిపించే క అక్షరాన్ని నొక్కాలి. అక్కడే మీకు క గుణింతానికి సంబంధించి దీర్ఘాలన్నీ కనిపిస్తాయి. అలాగే బని కూడా చేయాలి. ర కింద డ వత్తు ఇవ్వాలంటే అక్కడ కనిపించే నకారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు రని ప్రెస్ చేసి ఆ తరువాత నకారం గుర్తును ప్రెస్ చేయాలి ఆ తరువాత డ అక్షరాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది.