Smartphone Users Checking Mobile (Credits: X)

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది. క్రోమ్ బ్రౌజ‌ర్ యూజ‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌, అనేక బ‌గ్ లు ఉన్నాయ‌ని యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసిన కేంద్రం

తమ తాజా ఆదేశాలు పాటించాలని, తీసుకున్న చర్యలపై పదిహేను రోజులకోసారి రెగ్యులర్ అప్ డేట్స్ సమర్పించాలని సూచించింది. ఈ నిర్ణయాత్మక చర్యతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని ట్రాయ్ పేర్కొంది. పెరుగుతున్న సైబర్ నేరాలను, స్పామ్ కాల్స్ పేరుతో పెరుగుతున్న నేరాలను గుర్తించిన ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టర్ కాని టెలీమార్కెటర్లు స్పామ్ కాల్స్ చేస్తున్నట్లు గుర్తించిన ట్రాయ్ ఈ చర్యలు తీసుకుంది.