టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు (Twitter Layoffs) మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేసిన ఘటన మరువకముందే.. మళ్లీ 4 వేల మందిని ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించారని వార్తలు వస్తున్నాయి. ప్లాట్ ఫార్మర్ కేసీ న్యూటన్ రిపోర్ట్ ప్రకారం..నవంబర్ 11న (శనివారం) ఎలాన్ మస్క్ ట్విటర్‌లో పనిచేసే సుమారు 5,500 మందిలో 4,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే (4,000 more employees without prior notice) తొలగించినట్లు తెలిపారు.
ఒక వేళ సంస్థ తమని తొలగించిందని ఉద్యోగులు తెలుసుకోవాలంటే ఎలా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేసీ న్యూటన్..ఫైర్ చేసిన సిబ్బందికి సంస్థతో ఉన్న అన్నీ రకాల కమ్యూనికేషన్‌లు నిలిచిపోతాయని అన్నారు. తాజాగా తొలగించిన ఉద్యోగులు యూఎస్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ట్విటర్, లేదంటే మస్క్ తొలగించిన ఉద్యోగుల్ని మేనేజర్లు గుర్తించడం కష్టమేనని. ఒక్కసారి ఉద్యోగుల్ని తొలగిస్తే వారికి, మేనేజర్ల మధ్య ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతుందని కేసీ న్యూటన్ ట్విటర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. మస్క్ ఫైర్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టెర్మినేషన్ మెయిల్ వచ్చినట్లు సమాచారం.