WhatsaApp (Photo Credits: Pxfuel)

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp India) రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లవి ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ( IT Rules 2021) ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది. 2021 డిసెంబర్‌ నెలలో ఏకంగా 20, 79,000 బ్యాన్‌ చేసినట్లు (WhatsApp India banned 2 million accounts) వాట్సాప్‌ తెలిపింది. గత డిసెంబర్‌ నెలలో సుమారు 528 ఫిర్యాదుల నివేదికలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్‌ (WhatsApp) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.అంతకుముందు నవంబరులో 17లక్షల 59వేల అకౌంట్లను తొలగించింది.

వాట్సాప్‌లో యూజర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టుల సహాయంతో మరింత భద్రతను యూజర్లకు అందిస్తున్నామని వాట్సాప్‌ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌లో 13 కేటగిరీలలో 19.3 మిలియన్లకు పైగా చెడు కంటెంట్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 12 కేటగిరీలలో 2.4 మిలియన్లకు కంటెంట్‌ పోస్ట్‌లను తొలగించినట్లు మెటా సోమవారం వెల్లడించింది.

వాట్సప్ లో కొత్త ఫీచర్, ఇకపై అడ్మిన్స్ గ్రూపులో అభ్యంతర కరమైన మెసేజ్ లను తొలగించే అవకాశం...

తాజాగా వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకారం...వాట్సాప్‌ చాట్స్‌ బ్యాకప్స్‌లో భాగంగా పలు మార్పులు త్వరలోనే రానున్నట్లు పేర్కొంది. ‘బ్యాకప్‌ లిమిట్‌’, గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌ చేజింగ్‌, గూగుల్‌ డ్రైవ్‌ అల్‌మోస్ట్‌ ఫుల్‌, గూగుల్‌ డ్రైవ్‌ లిమిట్‌ రిచ్డ్‌ వంటి నోటిఫికేషన్స్‌తో యూజర్లను వాట్సాప్‌ అలర్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ పెయిడ్‌స్టోరేజ్‌పై ఎలాంటి సమాచారం లేదు. అయితే గూగుల్‌ డ్రైవ్‌లో అందించినట్లుగానే 15 జీబీ వరకు ఉచితంగా తరువాత స్టోరేజ్‌ కోసం 100 జీబీకు నెలకు రూ. 130 వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ డేటా రికవరీ చేసే థర్డ్ పార్టీ యాప్స్‌లలో డబ్ల్యుఏఎమ్ఆర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ యాప్ వల్ల మీ డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నట్లు భద్రత నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యాప్ వినియోగదారుల ఇంటర్నెట్ గోప్యతను దెబ్బతీస్తుంది అని నిపుణులు అన్నారు. వాట్సాప్ నియమ & నిబంధనల ప్రకారం సందేశాలన్నీ ఎన్ క్రిప్ట్ చేయబడతాయి.

అయితే, ఈ ఎన్ క్రిప్ట్ చేసిన సందేశాలను ఇతరులు చదవడం అసాధ్యం. ఈ డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది మీరు చాట్ చేసిన మెసేజ్‌లను తన కంపెనీకి చెందిన సర్వర్లలో నిలువ చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీ డేటా ఇతరుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ(ఐఐసీఎస్)కు చెందిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్ విభిన్న సెట్టింగ్స్ అనుమతి అవసరం కనుక, ఈ యాప్ సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వినియోగదారులు గ్యాలరీ, నెట్ వర్క్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ కి అనుమతి ఇవ్వడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం జరగనున్నట్లు పేర్కొన్నారు.